రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఈవీఎంలు, వీవీప్యాట్లు, ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పార్టీల నేతల సందేహాలను నివృత్తి చేశామని అన్నారు.
నేతల సందేహాలు నివృత్తి చేసిన రజత్ కుమార్ - ఎన్నికల ప్రధానాధికారి
రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఈవీఎంలు, వీవీప్యాట్లపై రాజకీయ నాయకులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. ఈసీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల నియమావళిపై అవగాహన నిర్వహించారు.
ఈసీ