తెలంగాణ

telangana

ETV Bharat / state

Voter list Process in TS : మరో దఫా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టిన ఈసీ - తెలంగాణ ఓటర్ల సంఖ్య

Voter list Process in TS
Voter list Process in TS

By

Published : May 27, 2023, 4:36 PM IST

Updated : May 27, 2023, 5:52 PM IST

16:31 May 27

అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా ప్రచురణ

Voter list Process in TS : శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరో దఫా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టింది. రెండో దఫా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ ఒకటి అర్హత తేదీగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టనుంది. ఆ తేదీకి 18 ఏళ్లు నిండిన వారు ఎవరైనా ఓటు హక్కుకు నమోదు చేసుకోవచ్చని సూచించింది. ఎన్నికల కమిషన్​ అధికార వెబ్​సైట్​ www.nvsp.inద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. జూన్​ 23 వరకు బీఎల్​ఓల ద్వారా ఇంటింటికి పరిశీలన చేస్తుందని తెలిపింది. జూన్ 24 నుంచి జూలై 27 వరకు పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, సిమిలర్ ఎంట్రీల తొలగింపు తదితర ప్రక్రియ పూర్తి చేయనున్నారు. అనంతరం ఆగస్టు 2న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించనుంది. దీనిపై ఆగస్టు 31 వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం కల్పించింది. ఏమైనా సమస్యలు, లోపాలు తలెత్తితే వాటి పరిష్కారానికి సెప్టెంబర్​ 2 వరకు గడువు ఇచ్చింది. ఈ ప్రక్రియను పూర్తి చేసి అక్టోబర్ 4న రాష్ట్ర ఓటర్ల తుది జాబితా ప్రకటించనుంది.

అక్టోబర్ 1 అర్హత తేదీగా ఓటర్ల జాబితా సవరణ :

తేదీ అంశం
జూన్​ 23 బీఎల్​ఓల ద్వారా ఇంటింటికి పరిశీలన
ఆగస్టు 2 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ
ఆగస్టు 31 అభ్యంతరాలు, వినతులకు అవకాశం(చివరి తేదీ)
సెప్టెంబర్ 2 అభ్యంతరాలు, వినతుల పరిష్కారానికి గడువు
అక్టోబర్ 4 ఓటర్ల తుది జాబితా ప్రచురణ

Awareness Session on the First Phase of Checking of EVMs : శాసనసభ ఎన్నికల సన్నాహాలను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రారంభించింది. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన కసరత్తులు చేస్తోంది. రాష్ట్రంలో ఈసీఐఎల్ ఇంజినీర్ల సమక్షంలో ఈవీఎంల మొదటి దశ తనిఖీ విషయంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాల గురించి అధికారులు చర్చించారు. డీఈఓలు, ఎఫ్ఎల్సీ విధానం, సింబల్ నమోదు విధానం, డిప్యూటీ డీఈఓల బాధ్యతలు, వీవీప్యాట్స్ వినియోగం గురించి కూలంకషంగా వివరించారు. వివిధ అంశాలకు సంబంధించి ప్రతి జిల్లాలో 18 మంది నోడల్ అధికారులను నియమించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు.

Total number of voters in Telangana : రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో జరిగే ఎన్నికల కోసం ఆధునిక, నూతన ఓటింగ్‌ యంత్రాలను వినియోగిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,99,77,659 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 34,891 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయని సీఈవో వికాస్​రాజ్ తెలిపారు.​ ఒక పోలింగ్‌ కేంద్రంలో 1,500 మంది ఓటర్లు మించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్లు పెరిగే కొద్దీ వాటి సంఖ్య పెరుగుతుందని చెప్పారు.

ఇవీ చదవండి :

Last Updated : May 27, 2023, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details