C Grants Permission To Release DA in Telangana : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. మూడు డీఏలు పెండింగ్లో ఉండగా.. ఒక డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ మధ్య సంప్రదింపులు జరిగాయి. డీఏల చెల్లింపు ఎందుకు ఆలస్యం అయిందని, ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది.
రైతు బంధు, డీఏ చెల్లింపులకు సీఈసీ అనుమతి కోరిన సర్కార్
గతంలో డీఏ చెల్లింపు విధానాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగింది. డీఏ విడుదలకు అనుమతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా ఈసీకి తమ వినతిని పంపాయి. ఈ నేపథ్యంలో తాజాగా పోలింగ్ ముగిసిన అనంతరం ఉద్యోగులకు డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఒక డీఏ విడుదలకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంది.
అర్హత ఉన్నా అందకపాయే.. ఎదురుచూపులే దిక్కాయే..!
Telangana Government Request on DA to Election Commission :రైతుబంధు, రుణమాఫీ, ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లింపు విషయంలో ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి ప్రతిపాదనలు చేసింది. ఎన్నికల నేపథ్యంలో వివిధ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదుకు చూసింది. వాటిపై ఈసీప్రభుత్వానికి వివరణ అడిగింది. 2022 జులై ఒకటో తేదీ నుంచి మూడు డీఏలు చెల్లించాల్సి ఉందలి.. కనీసం ఒక్కటైనా ఇవ్వడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వివరణ ఇవ్వగా డీఏ విడుదలకు అనుమతి ఇచ్చింది.
EC Declined Raithu Runa Mafi Request From Government : మరోవైపు రైతు రుణమాఫీ మిగిలిన మొత్తం చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈసీని అనుమతి కోరింది. మూడు విషయాలకు సంబంధించి ఈసీ ముందు ప్రతిపాదనలు చేయగా ఎన్నికల నేపథ్యంలో మొదట్లో రైతులకు రైతుబంధుకి అనుమతి ఇచ్చింది. డీఏ, రైతు రుణమాఫీ అనుమతులు ఇవ్వలేదు. ఎన్నికల అనంతరం ఒక్క డీఏ చెల్లింపునకు అనుమతిని ఇచ్చింది.
రైతుబంధు, డీఏ చెల్లింపుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాం : సీఈవో