రంగారెడ్డి జిల్లా బండ్లగూడ పురపాలక సంఘం పరిధిలోని గంధంగూడా డంపింగ్ యార్డును తరలించాలని కోరుతూ స్థానికులు ధర్నా చేపట్టారు. తమ గ్రామపంచాయతీ పురపాలక సంఘంగా ఏర్పడటం వల్ల పట్టణంలో ఉన్న చెత్తనంతా తీసుకువచ్చి ఇక్కడే పడేస్తున్నట్లు ఆరోపించారు. ముక్కుపుటాలు అదిరే దుర్వాసనతో ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా... పట్టించుకోవడంలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు ధర్నా చేపట్టిన విషయాన్ని తెలుసుకున్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అక్కడికి చేరుకున్నారు. డంపింగ్ యార్డును తరలించి తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి నెల రోజుల్లో డంపింగ్ యార్డును తరలిస్తానని హామీ ఇవ్వడంతో స్థానికులు ఆందోళన విరమించారు.
డంపింగ్ యార్డును తరలించాలని ధర్నా - గంధంగూడా
నగర శివారులోని గంధంగూడాలో గల డంపింగ్ యార్డును జనావాసాలకు దూరంగా తరలించాలని స్థానికులు ధర్నా చేశారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ హామీ ఇవ్వటం వల్ల ఆందోళన విరమించారు.
డంపింగ్ యార్డును తరలించాలని ధర్నా
Last Updated : Jun 18, 2019, 7:11 PM IST