తెలంగాణ

telangana

ETV Bharat / state

Drunk and drive: మందుబాబుల గుండెల్లో గుబులు

హైదరాబాద్​లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) తనిఖీలు మళ్లీ షురూ చేశారు. హైదరాబాద్​ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్​లోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి... పలువురిపై కేసులు నమోదు చేశారు. గతంలో కరోనా లాక్​డౌన్​ కారణంగా పోలీస్​ అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయలేదు. లాక్​డౌన్​ పూర్తి స్థాయిలో ఎత్తవేసిన తరుణంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Drunk and drive checks,jubilee hills hyderabad
Drunk and drive: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మళ్లీ ప్రారంభం

By

Published : Jun 26, 2021, 11:08 AM IST

మందు బాబుల ఆట కట్టించేందుకు పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు. లాక్​డౌన్​ పూర్తి స్థాయిలో ఎత్తివేసిన నేపథ్యంలో మందు బాబుల పనిపట్టేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు(Drunk and drive) మళ్లీ మొదలుపెట్టారు.

గత రాత్రి(శుక్రవారం) హైదరాబాద్​ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్​లోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఇక నుంచి మరింత కఠినతరంగా నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు.

గతంలో కొవిడ్ లాక్​డౌన్​ కారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) తనిఖీలు పోలీసులు నిలిపివేశారు. దీంతో మందుబాబులు విచ్చలవిడిగా వాహనాలతో రోడ్లపైకి వచ్చేవారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి పలు ప్రమాదాలకు కూడా కారణం అయ్యేవారు. ఇక నుంచి వారి ఆటలు సాగవని పోలీసులు హెచ్చరించారు.

ఇదీ చూడండి:నిషాలో హైదరాబాద్.. పర్యాటక కేంద్రాలే యువత స్పాట్

ABOUT THE AUTHOR

...view details