రాష్ట్రవ్యాప్తంగా 3148 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు - drunk and drive cases in hyderabad
13:11 January 01
రాష్ట్రవ్యాప్తంగా 3,148 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
నూతన సంవత్సరం సందర్భంగా చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 3,148 కేసులు నమోదు కాగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 951 కేసులు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 281, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 873 కేసులు నమోదు చేశారు. వాహనాలను సీజ్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడినవారిని కోర్టు ముందు ప్రవేశపెడుతామని పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: నూతన సంవత్సరం... నూతన లక్ష్యాలు