ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వత్సవాయి మండలం ఖమ్మంపాడు గ్రామంలో తాగునీరు కలుషితమై సుమారు 30 మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. పలువురికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. వెంటనే వారికి స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యులు చికిత్స అందించారు. స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్ అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
Drinking water: కలుషిత నీరు తాగి... 30 మందికి అస్వస్థత
కలుషిత నీరు తాగి దాదాపు 30 మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో చోటు చేసుకుంది. స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్ అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
30 మందికి అస్వస్థత
వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారు. గ్రామానికి సమీపంలోని మున్నేరు నుంచి రక్షిత తాగునీరు సరఫరా అయ్యే పైప్ లైన్‌కు మరమ్మతులు కావడంతో.. గ్రామంలోని పురాతన బావి నుంచి గత వారం రోజులుగా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నీరు కలుషితం కావడం వల్లే ప్రజలు ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. అధికారులు నీటి నమూనాలు సేకరించి పరీక్షిస్తున్నారు.
ఇదీ చదవండి:Contaminated water: ఆ నీళ్లు తాగాలంటేనే భయమేస్తోంది..!