తెలంగాణ

telangana

ETV Bharat / state

'సమస్యలు పరిష్కరించండి.. లేదంటే ఉద్ధృతం చేస్తాం' - hyd

హైదరాబాద్​లోని కూకట్​పల్లి కాలనీవాసులు రోడ్డెక్కారు. కాలనీలో డ్రైనేజీ సమస్యలపై అధికారులు స్పందించకపోతే... ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వెంటనే డ్రైనేజీ అవుట్​లెట్​ను నిర్మించాలని డిమాండ్​ చేశారు.

'సమస్యలు పరిష్కరించండి.. లేదంటే ఉద్ధృతం చేస్తాం'

By

Published : Jun 30, 2019, 12:45 PM IST

తమ సమస్యలను అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని హైదరాబాద్​లోని కూకట్​పల్లి కాలనీవాసులు రోడ్డెక్కారు. డ్రైనేజీ నిర్మించకుండా రోడ్డు ఆక్రమించి కొందరు అక్రమ కట్టడాలు నిర్మించారని, సదరు కట్టడాల్ని తొలగించాలని డిమాండ్​ చేశారు. వెంటనే డ్రైనేజీ అవుట్​లెట్​ను నిర్మించాలని రోడ్డుపై బైఠాయించారు. కాలనీలో ఉన్నటువంటి 276 ప్రభుత్వ భూమిలో 275 పేరిట జరుగుతున్న అక్రమ కట్టడాలను నిలిపివేసి ప్రభుత్వ భూమిని ప్రజావసరాల కోసం వినియోగించాలని అధికారులను కోరారు. ఎన్నికల సమయంలో తమ ఓట్ల కోసం వచ్చిన నాయకులు తమ సమస్యల పరిష్కారానికి మాత్రం ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే, కార్పొరేటర్​ డౌన్​ డౌన్​ అంటూ నినాదాలు చేశారు.

'సమస్యలు పరిష్కరించండి.. లేదంటే ఉద్ధృతం చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details