తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రత్యేక విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు - దోస్త్​ రిజిస్ట్రేషన్​ తాజా అప్​డేట్స్​

ప్రత్యేక విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును ఈనెల 28 వరకు పొడిగించారు. ఇటీవలి భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రుల వినతితో గడువు పొడిగించినట్లు కన్వీనర్ లింబాద్రి స్పష్టం చేశారు.

Dost registrations, web options date extended
ప్రత్యేక విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు పొడిగింపు

By

Published : Oct 26, 2020, 7:23 PM IST

డిగ్రీ సీట్ల భర్తీ కోసం కొనసాగుతున్న ప్రత్యేక విడత దోస్త్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువు ఈనెల 28 వరకు పొడిగించినట్లు కన్వీనర్ లింబాద్రి తెలిపారు. మూడో విడతలో సీటు పొందిన విద్యార్థులు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువును సైతం ఈనెల 28 వరకు పొడిగించారు. ఇటీవల భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రుల వినతితో గడువు పొడిగించినట్లు కన్వీనర్ పేర్కొన్నారు.

ప్రత్యేక విడత డిగ్రీ సీట్లను ఈనెల 31న కేటాయించనున్నారు. ప్రత్యేక విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 31 నుంచి నవంబరు 5 వరకు ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మొదటి విడత నుంచి ప్రత్యేక విడత వరకు సీటు పొంది.. ఆన్​లైన్​లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన అభ్యర్థులు ఈనెల 31 నుంచి నవంబరు 5 వరకు కాలేజీలకు వెళ్లి చేరాలని లింబాద్రి వెల్లడించారు.

ఇదీ చూడండి.. 'మీరు ఎన్ని ఎక్కువ పంపిణీ చేస్తే మాకు అంత లాభం'

ABOUT THE AUTHOR

...view details