కరోనా విజృంభిస్తోన్న సమయంలోనూ నిత్యం సేవలందిస్తోన్న పోలీసుల కోసం సహాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌కు మాస్కులు అందజేశారు. ఈ మేరకు ట్రస్ట్ ఛైర్మన్ రాజేశ్ అగర్వాల్ సీపీకి మాస్కులను పంపిణీ చేశారు.
సీపీ మహేశ్ భగవత్‌కు 10 వేల మాస్కుల అందజేత - masks donate to cp mahesh bhagawat
కరోనా పోరులో ముందుండి సేవలందిస్తోన్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలకు తమ వంతు సాయంగా పలువురు తమకు చేతనైన సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సహాయక ట్రస్ట్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు మాస్కులు అందజేశారు.
సీపీ మహేశ్ భగవత్‌కు 10 వేల మాస్కుల అందజేత
కరోనా పోరులో ముందుండి సేవలందిస్తోన్న పోలీసుల సేవలు ఎనలేనివని రాజేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. పోలీసులకు తన వంతు సాయంగా మాస్కులు అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ రాజేశ్ అగర్వాల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి: మంత్రి పువ్వాడ సమక్షంలో తెరాసలో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు