తెలంగాణ

telangana

ETV Bharat / state

రాజాసింగ్​కు శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు - BJP MLA Rajasingh latest news

ఇటీవల బెయిల్​పై ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నుదిటిపైన గడ్డ కావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాజాసింగ్​కు వైద్యులు ఆపరేషన్ చేసి ఆ గడ్డను తొలగించారు.

Doctors surgery to  MLA Rajasingh in hyderabad
Doctors surgery to MLA Rajasingh in hyderabad

By

Published : Nov 28, 2022, 7:32 PM IST

హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​కు నుదిటిపైన చిన్న గడ్డ కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. నిన్న సోమాజీగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లిపోమా సర్జరీ చేశారు. వారం రోజులు విశాంత్రి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు రాజాసింగ్​కు సూచించారు. జైల్లో నుంచి బయటికి రాకముందు నుంచే ఈ గడ్డ ఉందని రాజాసింగ్ తెలిపారు.

ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎమ్మెల్యే రాజాసింగ్​కి షరతులతో కూడిన బెయిల్​పై విడుదలయ్యారు.ఆ తర్వాత రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐబీ తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని మండిపడ్డారు. ముఖ్యమైన పనులపై బయటకు వెళ్తున్నప్పుడు దారి మధ్యలో వాహనం ఆగిపోతోందని చెప్పారు. ఉగ్రవాదుల నుంచి దాడుల ముప్పు పొంచి ఉన్న నాకు ఇలాంటి వాహనం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తన ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీకి మరో లేఖ రాసిన విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details