ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుది ఆత్మహత్యేనని... శవపరీక్ష అనంతరం ఉస్మానియా వైద్యులు నిర్థరించారు. ప్రాథమిక నివేదికను పోలీసులకు అందజేశారు. బసవతారకం ఆస్పత్రి నుంచి కోడెల పార్థివదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. రెండు గంటల పాటు ఉస్మానియా ఫోరెన్సిక్ వైద్య బృందం ఆధ్వర్యంలో శవ పరీక్ష చేశారు. పోస్టుమార్టం మొత్తం పోలీసులు వీడియో రికార్డు చేశారు. అనంతరం మృత దేహానికి వైద్యులు ఎంబాంబింగ్ చేశారు. ఈ సందర్భంగా ఉస్మానియా మార్చురీ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అనంతరం కుటుంబ సభ్యులు కోడెల భౌతికకాయాన్ని కార్యకర్తల సందర్శనార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు తరలించారు.
కోడెలది ఆత్మహత్యేనని వైద్యుల ప్రాథమిక నివేదిక
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు శవపరీక్ష అనంతరం... ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు పోలీసులకు ప్రాథమిక నివేదిక అందజేశారు. మెడ భాగంలో 8 ఇంచుల మేర తాడు బిగించుకున్న ఆనవాళ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
కోడెలది ఆత్మహత్యేనని వైద్యుల ప్రాథమిక నివేదిక