తెలంగాణ

telangana

ETV Bharat / state

గాంధీ ఆస్పత్రిలో జూనియర్​ డాక్టర్ల సమ్మెబాట

గాంధీలో డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమను ప్రమోషన్లకు దూరం చేస్తోందని ధర్నాకు దిగారు. అత్యవసర కేసులు మినహా మిగతా వైద్య సేవలు బహిష్కరించారు.

వయో పరిమితి తగ్గించండి.. ప్రమోషన్లు ఇవ్వండి..

By

Published : Jun 19, 2019, 1:05 PM IST

హైదరాబాద్​లోని గాంధీ ఆసుపత్రిలో మళ్లీ వైద్య సేవలు నిలిచిపోయాయి. కెరీర్ అడ్వాన్స్ మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ... మెడికల్ అసిస్టెంట్ ప్రోఫెసర్లు, మెడికల్ అసోసియెట్ ప్రోఫెసర్లు, జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. అత్యవసర కేసులు మినహా అన్నీ వైద్య సేవలు బహిష్కరించారు. వైద్య రంగంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని... 65 ఏళ్లకు పెంచిన వయో పరిమితిని 58కి తగ్గించాలని డిమాండ్ చేశారు. వయోపరిమితి పెంపు వల్ల తమకు ప్రమోషన్లు ఆలస్యమై.. తాము జూనియర్లుగానే మిగిలి పోతామని వాపోయారు.

వయో పరిమితి తగ్గించండి.. ప్రమోషన్లు ఇవ్వండి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details