సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన జావిద్ కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకున్నాడు. అనంతరం వారి బంధువులు గాంధీ క్యాజువాలిటీ వార్డుకు తరలించగా... ఆ సమయంలో ఉన్న ఇద్దరు మహిళా వైద్యులు అడ్మిట్ చేసుకుంటామని తెలిపారు. కేస్షీట్ తీసుకురావలని కోరారు. ముందు వైద్యం చేయాలని వారిపై కుటంబ సభ్యులు ఆగ్రహించి కర్రలతో దాడికి దిగారు. వైద్యుల ఫిర్యాదు మేరకు నిందితులను చిలకలగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి - javeed
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఒంటిపై నిప్పుఅంటించుకున్న ఓ వ్యక్తికి వైద్యం అందించాలంటూ...కుటుంబ సభ్యులు డాక్టర్లపై దాడికి దిగారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై దాడి