తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న గాంధీ ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ అయిన వైద్యుడు వసంత్ పోలీసులను ఆశ్రయించాడు. మీడియాకి తన ఆడియో, వీడియోలను విడుదల చేయడమే కాకుండా... వాట్సప్‌లో వైరల్ చేసినట్టు పేర్కొన్నారు. అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చిలకల గూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
గాంధీ ఆస్పత్రి సిబ్బందిపై పోలీసులకు డాక్టర్ వసంత్ ఫిర్యాదు
గాంధీ ఆస్పత్రి సిబ్బందిపై ఇటీవల డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ అయిన వైద్యుడు వసంత్ ఇవాళ చిలకలగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి చెందిన కొందరు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
ఆస్పత్రి ఆర్ఎంవోని దుర్భాషలు ఆడడం సహా వివిధ కారణాలతో వైద్యుడు వసంత్‌ని ఆస్పత్రి అధికారులు డీహెచ్ కార్యాలయానికి సరెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పలు నాటకీయ పరిణామాలు జరిగిన నేపథ్యంలో గురువారం వసంత్‌కి సంబంధించిన పలు ఆడియో, వీడియోలు గాంధీ అధికారులు విడుదల చేశారు. మెడికల్ దుకాణాల్లో లంచాలు తీసుకోవడం సహా పలువురిని లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వసంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.