హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో ఓ డాక్టర్ నర్సును వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాంపల్లికి చెందిన ఓ మహిళ నిలోఫర్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆర్ఎంఓ, నాట్కో బిల్డింగ్ ఇంఛార్జి డాక్టర్ రమేశ్ నిత్యం వేధింపులకు గురి చేసేవాడని బాధితురాలు ఆరోపించింది. అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని భర్తతో కలిసి నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
డాక్టర్ కాముడు - డాక్టర్ రమేశ్
నిలోఫర్ ఆసుపత్రిలో ఓ వైద్యుడు కామాంధుడిలా మారిపోయాడు. నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. డాక్టర్ పిచ్చివేషాలకు విసిగిపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.
నిలోఫర్ ఆసుపత్రి