కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. హైదరాబాద్ పాతబస్తీలోని ఆయుర్వేద ఆస్పత్రి, కళాశాలను ఎర్రగడ్డకు తరలించొద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆ ఆసుపత్రికి చికిత్స కోసం అనేకమంది రోగులు వస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదిక్, హోమియో, ఆయుష్‌కి నిధులు ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణకు కూడా భారీగా నిధులు ఇస్తున్నారని చెప్పారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో సికింద్రాబాద్‌లో ఆయుష్ హాస్పిటల్‌ని మంజూరు చేయించానని...58కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని వాటిని ఖర్చు చేయాలని మంత్రికి చెప్పినట్లు బండారు దత్తాత్రేయ వివరించారు.
ఆయుర్వేద ఆస్పత్రి తరలించొద్దు: దత్తాత్రేయ - bandar dhthathreya
హైదరాబాద్ పాతబస్తీలోని ఆయుర్వేద ఆస్పత్రి, కళాశాలను ఎర్రగడ్డకు తరలించొద్దని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ కోరారు. ఈ రోజు సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు సికింద్రాబాద్‌లో ఆయుష్ ఆస్పత్రి మంజూరు చేశానని గుర్తు చేశారు.
వినతి పత్రం ఇస్తూ
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ యాప్‌లో కొత్త ఫీచర్స్