తెలంగాణ

telangana

ETV Bharat / state

అపోహలొద్దు.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి: రమేశ్​ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 139 కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్​ కార్యక్రమం శనివారం ప్రారంభం అవుతుందని తెలంగాణ వైద్య విద్యామండలి సంచాలకులు రమేశ్​ రెడ్డి తెలిపారు. మెుదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకే టీకా అందిస్తామన్న ఆయన హైదరాబాద్​లోని గాంధీ, నర్సింగి ఆస్పత్రిల్లో టీకా తీసుకున్న వారితో ప్రధాని మోదీ మాట్లాడతారని పేర్కొన్నారు.

dme-ramesh-reddy-told-corona-vaccination-started-tomorrow-in-telangana
రాష్ట్రంలో రేపటి నుంచే కొవిడ్​ టీకా పంపిణీ: డీఎంఈ

By

Published : Jan 15, 2021, 2:56 PM IST

Updated : Jan 15, 2021, 3:22 PM IST

ఎలాంటి అపోహలు లేకుండా ప్రజలంతా కొవిడ్​ టీకా తీసుకోవాలని తెలంగాణ వైద్య విద్యామండలి సంచాలకులు రమేశ్​ రెడ్డి కోరారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 139 కేంద్రాల్లో టీకాల కార్యక్రమం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. తొలి విడతలో ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్​ ఇవ్వనున్నట్లు తెలిపిన ఆయన గాంధీ, నర్సింగి ఆస్పత్రిల్లో టీకా తీసుకున్న వారితో ప్రధాని మోదీ మాట్లాడతారని తెలిపారు.

రాష్ట్రంలో రేపటి నుంచే కొవిడ్​ టీకా పంపిణీ: డీఎంఈ

కరోనా వ్యాక్సిన్​లు ఇప్పటికే ​ వివిధ జిల్లాలకు చేరుకున్నాయన్న డీఎంఈ రెండవ విడతలో 50 ఏళ్లుపై బడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. వ్యాధి తగ్గిన తరువాత 4 వారాల వ్యవధిలో వ్యాక్సిన్ తీసుకోవాలన్న రమేశ్​ రెడ్డి కిడ్నీ, గుండె జబ్బులు ఉన్న వారు కూడా నిరభ్యంతరంగా టీకా వేయించుకోవాలని సూచించారు. ఏ మందు అయినా కొందరిలో రియాక్షన్స్ రావడం సహజమేనని, లక్షల్లో ఒకరికి కూడా పెద్దగా రియాక్షన్స్ వస్తాయని చెప్పలేమని అన్నారు. 10 రోజుల్లో వైద్య, ఆరోగ్య సిబ్బందికి టీకా వేయడం పూర్తవుతుందని విరరించారు. ఎవరికైనా సమస్యలు వస్తే చికిత్స కోసం 57 ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేశామన్న డీఎంఈ గాంధీ ఆస్పత్రిలో 12 పడకలతో ప్రత్యేకంగా ఐసీయూని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:పతంగులు నేర్పుతున్న ఆర్థిక పాఠాలు.. పాటిస్తే విజయాలే!

Last Updated : Jan 15, 2021, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details