జీహెచ్ఎంసీలోని 5 వేల 156 మంది శాశ్వత ఉద్యోగులకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ దీపావళి కానుక ప్రకటించారు. ఉద్యోగులకు, వారి కుటుంబసభ్యులకు వైద్య బీమా సౌకర్యం కల్పించనున్నట్లు ప్రకటించారు. నవంబర్ ఒకటి నుంచి బీమా వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు బీమా ప్రీమియం మొదటి విడత మొత్తాన్ని ఇన్సూరెన్స్ ఏజెన్సీకి అందించనున్నట్లు తెలిపారు. ఉద్యోగి తన భర్త లేదా భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిపి మొత్తం ఆరుగురికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. ఈ బీమా మూడు లక్షల విలువ వర్తింపజేస్తుందని... మరో మూడు లక్షల వరకు వెసులుబాటు కూడా ఉందని పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ శాశ్వత ఉద్యోగులకు దీపావళి కానుక - insurance for ghmce permanent employees
జీహెచ్ఎంసీలో శాశ్వత ఉద్యోగులకు, వారి కుటుంబసభ్యులకు వైద్య బీమా సౌకర్యం కల్పిస్తూ నగర మేయర్ బొంతు రామ్మోహన్ దీపావళి కానుక ప్రకటించారు.
జీహెచ్ఎంసీ శాశ్వత ఉద్యోగులకు దీపావళి కానుక