వచ్చే నెల 20 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ బతుకమ్మ పండుగను పురస్కరించుకుని 1.02 కోట్ల మంది ఆడపడుచులకు చీరలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 20 నుంచి చీరల పంపిణీ ప్రారంభం కానుంది. ఎంగిలిపూల పండుగ సెప్టెంబర్28న అవుతుండగా అంతకంటే ఒకరోజు ముందుగానే పంపిణీ పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. రూ.313 కోట్లతో చీరలను సిరిసిల్లలో నేత కార్మికులు తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉత్పత్తి అయిన వాటిలో 50 లక్షల చీరలను జిల్లాలకు పంపించారు. మిగతావి నెలాఖరుకు పూర్తి కానున్నాయి.
చీరకు రూ.280
కలెక్టర్ల పర్యవేక్షణలో గ్రామస్థాయిలో వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, రేషన్ డీలర్లతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు. పట్టణాలు, నగరాల్లో పుర, నగరపాలక సంస్థల పరిధిలోని మహిళా సంఘాల ద్వారా అందిస్తారు. బతుకమ్మ చీరలను ఈసారి మరింత నాణ్యతతో అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వంద డిజైన్లలో వీటిని తయారు చేయించారు. ఒక్కో చీరకు సగటున రూ.280 వ్యయమైంది.
ఇదీ చూడండి :హెల్మెట్ పెట్టుకుంటేనే జైల్లోకి.