2021 ఓటరు జాబితా ఆధారంగా ఆంధ్రప్రదేెశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ.. దాఖలైన వ్యాజ్యాల్ని హైకోర్టు కొట్టిపారేసింది.
2019 ఓటర్ల జాబితాపై దాఖలైన పిటిషన్లు కొట్టివేత - హైదరాబాద్ వార్తలు
2019 ఓటర్ల జాబితాపై దాఖలైన వ్యాజ్యాలను ఏపీ ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. 2019 ఓటరు జాబితా ఆధారంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోతారన్న పిటిషనర్ల వాదనతో ధర్మాసనం విభేదించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.
Breaking News
2019 ఓటరు జాబితా ఆధారంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంవల్ల.. 3లక్షల 60 వేల మంది యువ ఓటర్లు ఓటు హక్కు కోల్పోతున్నారన్న పిటిషనర్ల వాదనతో ధర్మాసనం విభేదించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్న ఉన్నత న్యాయస్థానం.. ఈ విషయంలో దాఖలైన 2 వ్యాజ్యాలను తోసిపుచ్చింది.
ఇదీ చదవండి:భాజపా సరికొత్త వ్యూహం.. అధికారమే లక్ష్యం