Discount on Traffic Pending Challans : హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ చలానాల రాయితీలు అమల్లోకి వచ్చాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 75 శాతం, కార్లు, లారీలకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70శాతం, తోపుడు బండ్లకు 80 శాతం రాయితీతో పెండింగ్ చలాన్లను చెల్లించే అవకాశాన్ని పోలీసులు కల్పించారు. కొవిడ్ నిబంధనల్లో మాస్క్ ధరించని వారికి విధించిన జరిమానాల్లో 90 శాతం రాయితీ కల్పించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 1.7 కోట్లు చలాన్లతో రూ.600 కోట్ల జరిమానా పెండింగ్ ఉన్నట్లు గణంకాలు వెల్లడిస్తున్నాయి. చలన్లా చెల్లింపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావటంతో తొలి 8 గంటల్లో లక్షా 77వేల చలానాలను వాహనదారులు చెల్లించారు. వీటి ద్వారా రూ.కోటి 77లక్షల రూపాయలు జమయ్యాయి.
పెండిగ్ చలాన్ల క్లియరింగ్ కోసం..
రాష్ట్రవ్యాప్తంగా 1750 కోట్ల రూపాయల చలాన్లు పెండింగ్ ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసుల వెబ్ సైట్ తో పాటు మీ సేవలో చలాన్లు చెల్లించే అవకాశాన్ని పోలీసులు కల్పించారు. సాంకేతిక సమస్య తలెత్తకుండా సర్వర్లను సామర్థ్యం పెంచిన ట్రాఫిక్ పోలీసులు... యూపీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. వాహనదారుల సౌలభ్యం కోసం ఈ నెల 31వరకు రాయితీపై చెల్లించే అవకాశాన్ని ట్రాఫిక్ పోలీసులు కల్పించారు. రహదారి నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి విధించిన చలానాలను రాయితీ ద్వారా చెల్లించేందుకు పోలీసుశాఖ ఇచ్చిన అవకాశం మంగళవారం నుంచి అమలులోకి రానుంది. మార్చి 31 వరకూ ఇది అమలులో ఉంటుంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన నేరంపై పోలీసులు జరిమానాలు విధించినా చాలామంది వాటిని చెల్లించేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ బకాయిలు దాదాపు రూ.2300 కోట్లకు చేరాయి. దాంతో ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు పోలీసుశాఖ భారీగా రాయితీలు ప్రకటించింది.
ఇవాళ్టి నుంచే..
Traffic Challans Discount: రాష్ట్రంలో వాహన చలానాల మొత్తం కొండలా పేరుకుపోయింది. ట్రాఫిక్ జరిమానాల మొత్తం 1250 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాదాపు 90 శాతం మంది వాహనదారులకు జరిమానా భారంగా మారినట్లు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. కొండలా పేరుకు పోయిన వాహన చలానా మొత్తాన్ని రాబట్టేందుకు రాయితీ స్కీము తీసుకురావాలని భావించిన పోలీసు శాఖ.. ఇవాళ్టి నుంచి మార్చి 31 వరకు ఈ రాయితీలను అమలు చేస్తుంది.