భాగ్యనగరంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లు గిరాకీలు లేక ఇబ్బంది పడుతున్నారు. లాక్‌డౌన్‌లో ప్రజలు సొంత వాహనాలు ఉపయోగిస్తున్నారు. లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ పరిస్థితి మారలేదని వారు అంటున్నారు.
భాగ్యనగరంలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల బాధలు - హైదరాబాద్‌లో ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఇబ్బందులు
లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఆటోలు, క్యాబ్‌లకు అనుమతి ఇచ్చినప్పటికీ … డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా ప్రభావంతో ఎక్కువ శాతం మంది సొంత వాహనాలు ఉపయోగిస్తున్నారు. దీనివల్ల గిరాకీ లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చెబుతున్న ఆటో, క్యాబ్ డ్రైవర్లతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖీ.
ఆటో, క్యాబ్ డ్రైవర్ల కష్టాలు
ప్రయాణికుల కోసం ఎదురుచూస్తున్నామని క్యాబ్, ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. వర్క్ ఫ్రం హోంతో క్యాబ్‌లను ఐటీ కంపెనీలు తగ్గించాయి. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని, రోజుకి రూ.500 వచ్చే పరిస్థితి లేదని డ్రైవర్లు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చూడండి :అర్వింద్‌పై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు