జాతీయ వైద్య బిల్లుకు నిరసనగా గాంధీ జూనియర్ డాక్టర్ల ఆందోళన నాలుగో రోజుకు చేరుకుంది. అందులో భాగంగానే ఈ రోజు జూడాలు వినూత్నంగా తమ నిరసన తెలిపారు. ఆస్పత్రి ఆవరణలో "నో ఎన్ఎంసీ" అక్షరాలు కనిపించేలా కూర్చొని తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద మానవహారం ద్వారా బిల్లు పట్ల వ్యతిరేకతను తెలిపారు. ఎన్ఎంసీ బిల్లు వల్ల వైద్యుల ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని జూడాలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్ఎంసీ బిల్లును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
గాంధీ ఆస్పత్రిలో జూడాల వినూత్న నిరసన
ధర్నా చేసేవారు చేతిలో ప్లకార్డులు పట్టుకొని, నల్ల బాడ్జీలు ధరించి, ర్యాలీలు, మానవహారాలు, రిలే నిరాహార దీక్షలు, నిరశన దీక్షలు చేపట్టడం మన ఇప్పటి వరకూ చూశాం. కానీ గాంధీ ఆస్పత్రి జూడాలు మాత్రం భిన్నంగా తమ నిరసనను వ్యక్తం చేశారు.
గాంధీ జూడాల వినూత్న నిరసన