రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్ సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ జిల్లా మినహా 570 మండలాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో సీఎస్ సోమేశ్ కుమార్ ధరణి సేవలను పరిశీలించారు. గత నెల 29న సీఎం కేసీఆర్ పోర్టల్‌ను ప్రారంభించారు.
త్వరలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు
ఇప్పటివరకు లక్షా 48 వేల ఎకరాలకు సంబంధించి 59 లక్షల 46 వేల ఖాతాలు ధరణిలో నిక్షిప్తం అయ్యాయని సీఎస్ తెలిపారు. ఇకపై ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. తొలినాళ్లలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలు ఎదుర్కొనేందుకు నిపుణుల బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. తొలుత నాలుగు రకాల సేవలు ప్రారంభించామని... త్వరలోనే వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తామని సోమేశ్‌కుమార్ వెల్లడించారు.