రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘనలపై 2లక్షల 61వేల కేసులు నమోదు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని ఉన్నత న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై డీజీపీ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఔషధాల బ్లాక్ మార్కెట్‌పై 150కేసులు నమోదు చేశామన్నారు.
DGP: లాక్‌డౌన్, కర్ఫ్యూ ఉల్లంఘనలపై 2.61లక్షల కేసులు - telangana varthalu
తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61లక్షల కేసులు నమోదు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు. లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై డీజీపీ హైకోర్టుకు నివేదిక సమర్పించారు.
DGP: లాక్‌డౌన్, కర్ఫ్యూ ఉల్లంఘనలపై 2.61లక్షల కేసులు
ఏప్రిల్ 1నుంచి మే30వ తేదీ వరకు 7.49లక్షల కేసులు నమోదు చేశామన్నారు. మాస్కులు ధరించని వారిపై 4లక్షల 18వేల కేసులు నమోదు చేసి 35.81కోట్లు జరిమానా విధించినట్లు నివేదికలో పేర్కొన్నారు. జనం గూమిగూడినందుకు 13,867కేసులు పెట్టామని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో డీజీపీ వివరించారు.
ఇదీ చదవండి: CORONA: ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి