ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు.. ఆ రాష్ట్ర ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అభినందించారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామనీ.. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.
'పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాం' - Ap latest news
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని.. ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ అభినందించారని అన్నారు.
'పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాం'
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పోలీసులకు కరోనా సోకినట్టు ఎటువంటి నివేదికలు లేవనీ... అవసరమైతే సిబ్బందికి వాక్సిన్ వేయిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి :జీవశాస్త్రాల పురోగతికి ఔషధం