తెలంగాణ

telangana

ETV Bharat / state

మహానంది వెళ్తున్నారా ఇకపై ఆ నిబంధనలు తప్పనిసరి

Dress Code in Mahanandi Temple: ఆంధ్రప్రదేశ్​లోని మహానంది దర్శించుకునే భక్తులు జనవరి ఒకటో తేదీ నుంచి సాంప్రదాయ దుస్తులను ధరించడం తప్పనిసరని ఆలయ చైర్మన్ మహేశ్వర రెడ్డి, కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ తెలిపారు. పురుషులు పంచా, పైజామా.. ఆడవారు చీర, పంజాబీ డ్రెస్​ ధరించాలని పేర్కొన్నారు.

మహానంది
మహానంది

By

Published : Dec 29, 2022, 10:41 PM IST

Dress Code in Mahanandi Temple: ఆంధ్రప్రదేశ్​లోని ప్రముఖ శైవ క్షేత్రమైన నంద్యాల జిల్లా మహానందిని దర్శించుకునే భక్తులు ఇకపై సాంప్రదాయ దుస్తులను ధరించడం తప్పనిసరి. పురుషులు పంచా, పైజామా.. ఆడవారు చీర, పంజాబీ డ్రెస్​ను ధరించాలి. ఆలయ ఆవరణలో రుద్రగుండం కోనేరులో పుణ్య స్నానాలు చేసేవారు ఇవే దుస్తులు ధరించాలి.

2023 జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్లు ఆలయ చైర్మన్ మహేశ్వర రెడ్డి, కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్.. మహానంది దేవస్థానం కార్యాలయంలో వివరాలను వెల్లడించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details