చిలకలగూడలోని మున్సిపల్ కాంప్లెక్స్ మైదానాన్ని ప్రజలు ఉపయోగించుకొనే వాకింగ్ కేంద్రంగా తీర్చిదిద్దాలని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. మైదానాన్ని చదును చేసి... పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి చిలకలగుడా జీహెచ్ఎంసీ మైదానాన్ని పరిశీలించారు.
'చిలకలగూడ మైదానాన్ని వాకింగ్ కేంద్రంగా తీర్చిదిద్దండి'
ప్రజలు ఉపయోగించుకునేందుకు, సభలు, సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా చిలకలగూడలోని మున్సిపల్ కాంప్లెక్స్ మైదానాన్ని తీర్చిదిద్దాలని ఉపసభాపతి అధికారులను ఆదేశించారు. వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు.
'చిలకలగూడ మైదానాన్ని వాకింగ్ కేంద్రంగా తీర్చిదిద్దండి'
మైదానంలో రూ.134 కోట్లతో మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్ భవనాలను నిర్మించాలని గతంలోనే ప్రతిపాదించినట్లు పద్మారావుగౌడ్ తెలిపారు. కానీ అందుబాటులో ఉన్న ఏకైక మైదానాన్ని వివిధ సభలు, సమావేశాల నిర్వహణకు సద్వినియోగం చేసుకొనే లక్ష్యంతో యథాతథంగా ఉంచాలని నిర్ణయించామని వెల్లడించారు. వెంటనే వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి:'అధిక ఫీజులు వసూలు చేస్తే తిరిగి చెల్లించేలా ఆదేశాలు'