కూకట్పల్లి మండల పరిధిలోని కైతలాపూర్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ సిబ్బంది భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. గతంలో అక్రమ లేఅవుట్లు ఏర్పాటు చేస్తే వాటిని రద్దు చేశామని కూకట్పల్లి తహసీల్దార్ నిర్మల నాయర్ తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... రాత్రికి రాత్రే నిర్మాణాలు వెలిశాయని చెప్పారు. ఇవాళ పోలీసుల బందోబస్తు మధ్య తొలగించినట్లు తెలిపారు. మరోసారి అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా కంచె ఏర్పాటు చేస్తామని తహసీల్దార్ వెల్లడించారు.
భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేత
అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ శాఖ దాడులు తీవ్రం చేసింది. కూకట్ పల్లి పరిధిలో అనుమతులు లేని నిర్మాణాలు కూల్చివేసింది.
భారీ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల కూల్చివేత