ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్‌కుమార్ మృతి పట్ల ప్రముఖ ఉర్దూ పాత్రికేయుడు అలీ సిద్దిఖీ కుమారుడు డాక్టర్ కబీర్ సిద్దికీ విచారం వ్యక్తం చేశారు. దిలీప్‌కుమార్ లేనిలోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
నటుడు దిలీప్ కుమార్‌తో.. 1984లో దిల్లీలో జరిగిన మొట్టమొదటి ఉర్దూ సమావేశాన్ని నటుడు దిలీప్‌కుమార్ ప్రారంభించి.. ఉర్దూలోనే ప్రసంగించారని గుర్తు చేసుకున్నారు. ఆయనకు హైదరాబాద్‌తో ఎనలేని అనుబంధం ఉందని.. భాగ్యనగరంలో జరిగిన అనేక కవిత పఠణాల్లో దిలీప్ కుమార్ పాల్గొన్నారని తెలిపారు.
నటుడిగానే కాకుండా రాజకీయ, విద్య, సంక్షేమ కార్యక్రమాల్లో దిలీప్‌కుమార్ చురుగ్గా ఉండేవారని సిద్దిఖీ పేర్కొన్నారు. దిలీప్‌కుమార్ మృతి పట్ల అలీ సిద్దిఖీ భార్య సబ్రీ సుల్తానా విచారం వ్యక్తం చేశారు. దిలీప్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తమ ఇంటికి వచ్చే వారని.. తన భర్తకు మంచి మిత్రుడని పేర్కొన్నారు.
గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న దిలీప్ కుమార్ ముంబయి హిందూజ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస(Dilip Kumar Died) విడిచారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ తారలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంటాక్రూజ్ ముంబయిలోని జుహు కబ్రాస్థాన్లో బుధవారం సాయంత్రం 5 గంటలకు దిలీప్ కుమార్‌కు అంత్రక్రియలు నిర్వహించారు.
ఇదీ చూడండి:Dilip Kumar: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత