Power day in Telangana Formation day celebrations : రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా.. విద్యుత్ ప్రగతి సంబరాలను మంత్రులు, ప్రజాప్రతనిధులు ఊరూవాడా సందడిగా నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, అద్భుత పురోగతితో దేశానికే దారిచూపే టార్చ్ బేరర్ గా తెలంగాణ నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ విద్యుత్ ప్రగతి - నిత్య కోతల నుంచి నిరంతర వెలుగులకు ప్రస్థానం అంటూ ట్వీట్ చేశారు. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షతో కరెంట్ నిరంతరాయంగా వెలుగులు పంచుతోందని పేర్కొన్నారు. నేడు యావత్ భారతదేశంలో కరెంటు కోతలు లేని ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మండు వేసవిలో సైతం అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్నట్లు చెప్పారు.
విద్యుత్ సౌధలో దశాబ్ది ఉత్సవాలు :విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది కృషి తోనే 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమైందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ అంబర్‌పేట్‌లో విద్యుత్ శాఖ నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. దేశ సగటు విద్యుత్ వినియోగం కంటే.. రాష్ట్ర సగటు విద్యుత్ వినియోగం 70శాతం అధికంగా ఉందని ట్రాన్స్ కో- జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. హైదరాబాద్ విద్యుత్ సౌధలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ ప్రగతి కార్యక్రమంలో ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. రాష్ట్ర సగటు విద్యుత్ వినియోగం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందంటూ ప్రభాకర్‌రావు వ్యాఖ్యానించారు.
Telangana Decade Celebrations : నేడు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవ సభలు