బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాఖల వారీగా పద్దులపై చర్చ ముగిసింది. రెండు రోజులుగా 26 పద్దులపై అసెంబ్లీ చర్చ జరిపి ఆమోదించింది. ఇవాళ మరో 12 శాఖలపై చర్చ జరిపింది. సాగునీటి పారుదల, సాధారణ పరిపాలన, కార్మిక, ఉపాధి కల్పన, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, రహదారులు, భవనాలు, విద్యుత్, శాసన, న్యాయ, ప్రణాళిక శాఖలపై సభ్యులు చర్చించారు.
బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో ముగిసిన చర్చ - Telangana news
బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో చర్చ ముగిసింది. మూడు రోజులుగా 38 పద్దులపై శాసనసభ చర్చ జరిపి ఆమోదించింది. శుక్రవారం ద్రవ్యవినిమయ బిల్లులపై సభ చర్చించనుంది.
Budget Bills in assembly
ఉద్యోగుల వయో పరిమితి పెంపు, వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు సంబంధించిన సవరణల బిల్లులపై కూడా చర్చ జరిగింది. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లులపై చర్చ అనంతరం శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.