ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు ముగిసింది. మంగళవారం అర్ధరాత్రిలోగా కార్మికులు విధుల్లో చేరాలని... లేకపోతే ఉద్యోగాలు ఉండవని హెచ్చరించారు. కేసీఆర్ ఆదేశాలను ఆర్టీసీ ఐకాస లెక్కచేయలేదు. తమను చర్చలకు పిలిచే వరకు సమ్మె విరమించేది లేదని తేల్చిచెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి వరకు మొత్తం 360 మంది ఉద్యోగులు విధుల్లో చేరారు. డెడ్లైన్ ముగియడంతో ఏం జరగబోతుందోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ముగిసిన డెడ్లైన్... తర్వాత ఏం జరగనుందో..? - deadline end for tsrtc employees
సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. ఈ నేపథ్యంలో గడువులోపు రాష్ట్ర వ్యాప్తంగా 360 మంది విధుల్లో చేరేందుకు లేఖలిచ్చినట్లు సమాచారం.
ముగిసిన డెడ్లైన్... తర్వాత ఏం జరగనుందో..?
Last Updated : Nov 6, 2019, 7:28 AM IST