ఛాయ్ బండి నుంచి స్టార్ హోటల్స్ వరకు... రోజు వారి కూలీ నుంచి సగటు ఉద్యోగి వరకు ఇలా కరోనా మహ్మమారి ఎవరినీ వదలడం లేదు. ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. హైదరాబాద్లో ప్రతి ఏటా సమ్మర్ క్యాంపు ఏర్పాటు డ్యాన్స్ మాస్టర్ల ఉపాధిని దెబ్బతీసింది. ప్రతిరోజు రెండు, మూడు క్లాసులు చెప్పినా 300 మందికి డ్యాన్స్ శిక్షణ ఇచ్చే డ్యాన్స్ మాస్టర్లు కూడా ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు.
కరోనా దెబ్బ: ఉపాధి కోల్పోతున్న డ్యాన్స్ మాస్టర్లు
కరోనా మహమ్మారి అందరి జీవితాలను అతలాకుతలం చేస్తోంది. కూలీ పని చేసుకునే వారినుంచి సగటు ప్రైవేట్ ఉద్యోగుల వరకు సైతం ఉపాధి లేకుండా చేస్తోంది. హైదరాబాద్లో డ్యాన్స్ అకాడమీలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. సమ్మర్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా శిక్షణనిచ్చే డ్యాన్స్ మాస్టర్లు తమ జీవనోపాధి కోల్పోయి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని చందానగర్, మణికొండ, బీరంగూడ ప్రాంతాల్లో డ్యాన్స్ శిక్షణ సంస్థలు ఏర్పాటు చేసి ఉపాధి పొందే ఓ నిర్వాహకుడు కరోనాతో రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోతున్నారు. మాట్లాడుతూ కరోనా తీవ్రత తగ్గింది అనుకునేలోపే కరోనా రెండో దశ వచ్చి తమ ఉపాధిని దెబ్బ తీసిందని డాన్స్ మాస్టర్ రఘు వాపోతున్నారు. క్లాసుకు నలుగురు విద్యార్థులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి శిక్షణ కోసం తీసుకున్న బిల్డింగ్ కిరాయి కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నామని తన బాధను వెలిబుచ్చారు.