తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓఆర్​ఆర్​ ప్రాంతవాసులకు జలమండలి నీరు - hyderabad jala mandali

ఓఆర్ఆర్‌ ప్రాంతంలోని 193 గ్రామాల్లో వేసవిలో మంచినీటి సరఫరా చేపడుతున్నట్లు జలమండలి ఎండీ దాన కిషోర్ చెప్పారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షించారు.

dana kishor Review  On ORR areas water suppl
ఓఆర్​ఆర్​ ప్రాంతవాసులకు జలమండలి నీరు

By

Published : Feb 25, 2020, 11:01 PM IST

ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో జలమండలి ఎండీ దాన కిషోర్ అధికారులతో సమావేశమయ్యారు. ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుపై అధికారులతో చర్చించారు. ఓఆర్ఆర్‌ ప్రాంతంలోని 193 గ్రామాల్లో వేసవిలో మంచినీటి సరఫరా చేపడుతున్నట్లు చెప్పారు. ఆయా ప్రాంతాల్లో 1.5 కోట్లతో నూతనంగా 17 ఫిల్లింగ్ స్టేషన్లు, 60 మంచినీటి ట్యాంకర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి 15 నుంచి జలమండలి ట్యాంకర్ల సేవలు అందుబాటులోకి రావాలని సూచించారు.

ఓఆర్ఆర్ గ్రామాలు, మున్సిపాలిటీల నుంచి సేకరించిన కనెక్షన్ల వివరాలకు తాత్కాలికంగా క్యాన్ నెంబర్ కేటాయించాలన్నారు. సర్వే అనంతరం శాశ్వత క్యాన్ నెంబర్ కేటాయింపు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ నెల నుంచి వాణిజ్య కనెక్షన్ల నుంచి 100 శాతం బిల్లుల వసూలుతో పాటు కొంత మొత్తం పాత బకాయిలను వసూలు చేయాలని అధికారులను ఎండీ ఆదేశించారు.

ఇదీ చూడండి:'ఇలా చేస్తేనైనా సమస్య పరిష్కరిస్తారేమో అని...'

ABOUT THE AUTHOR

...view details