వలస కార్మికులను క్షేమంగా వారి స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖలు అన్ని ఏర్పాట్లు చేశాయని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించడంతో పాటు వారికి మానసిక స్థైర్యాన్ని కల్పించేందుకు సైబరాబాద్ పోలీసులు తరచూ కార్మికులతో సమావేశమవుతున్నారన్నారు. కార్మికుల వివరాలు నమోదు చేసుకొని షెడ్యూల్ ప్రకారం వారికి రైల్లో బెర్తులు కేటాయిస్తున్నారన్నారు.
కార్మికులు కాలినడకన ప్రయాణం చేయొద్దు: సీపీ సజ్జనార్
వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. కార్మికులు కాలినడకన ప్రయాణం చేయొద్దని సూచించారు.
కార్మికులు కాలినడకన ప్రయాణం చేయొద్దు: సీపీ సజ్జనార్
వలస కార్మికులు కాలి నడకన ప్రయాణం చేయొద్దని.. డీహైడ్రేషన్, రోడ్డు ప్రమాదాల బారిన పడొద్దని సీపీ సజ్జనార్ సూచించారు.