'సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 100కు పైగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. సిబ్బందితో కలిసి పకడ్బందీగా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రజలందరూ ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిచ్చిన రంగాల వారిని మాత్రమే బయటకు రావడానికి అనుమతినిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.'
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు: సీపీ సజ్జనార్ - cp sajjanar observed lockdown in cyberabad commissionerate
హైదరాబాద్‌లో లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. పలు ప్రాంతాల్లో పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి రహదారులపైకి వచ్చే వారిని కట్టడి చేస్తున్నారు. హైటెక్‌సిటీ, జేఎన్టీయూ, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ తదితర ప్రాంతాల్లో పోలీసు చెక్‌పోస్టులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న... సీపీ సజ్జనార్‌తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి...
లాక్‌డౌన్‌పై సీపీ సజ్జనార్‌తో ముఖాముఖి