అమ్మాయిల ఫోటోలను ఇంస్టాగ్రామ్లో పెట్టి... కాల్ గర్ల్‌గా చిత్రీకరిస్తూ, అమాయక యువత నుంచి డబ్బులు దండుకుంటున్న ఓ వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్ పేటలో నివాసం ఉండే రుచిత, మణికేత్ రెడ్డి 2018 నుంచి సహజీవనం చేస్తున్నారు. అంబర్ పేటలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. ఏడాది వరకు వారి జీవితం సాఫీగానే సాగింది. అనంతరం మణికేత్ రెడ్డి రెండు నెలల క్రితం ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. బాధిత యువతి రుచిత తన భర్త కనిపించట్లేదంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించింది.
తరచూగా మారుస్తూ...
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మణికేత్ రెడ్డితో ఉన్నప్పుడు తరుచూ మొబైల్ నెంబర్లు మారుస్తూ ఉండట వల్ల...ఆ నెంబర్లను సోషల్ మీడియాలో సెర్చ్ చేసింది. సదరు నెంబర్లపై పలువురు మహిళల పేర్లతో అకౌంట్లు ఇంస్టాగ్రామ్లో ప్రత్యక్షమయ్యాయి.
అంతర్జాలం నుంచి సేకరించిన మహిళల ఫోటోలు పెడుతూ... యువతను ప్రేరేపించే విధంగా పోస్టులు పెట్టేవాడు. ఆ అకౌంట్లలో తన ఫోటోతో పాటు, స్నేహితురాలి ఫోటోనూ చూసిన బాధితురాలు... కంగుతింది.