హైదరాబాద్ లంగర్ హౌజ్‌కు చెందిన అమర్ యాదవ్‌కు బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నట్లు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. బ్యాంకు ఖాతాను అప్ డేట్ చేయించుకోండని సలహా ఇచ్చాడు. 'ఎనీ డెస్క్' యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. అది నమ్మి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్న కొద్దిసేపటికే అమర్ ఖాతాలోంచి రూ. 55 వేలు డ్రా అయ్యాయి. తిరిగి ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ చేసి ఉంది.
బ్యాంకు ఖాతా అప్డేట్ చేసుకోవాలని చెప్పి డబ్బులు డ్రా - హైదరాబాద్ జిల్లా తాజా వార్తలు
లక్షల విలువైన వస్తువులు అతి తక్కువ ధరలకే అమ్ముతామంటూ సామాజిక మాధ్యమాల్లో పెట్టే ప్రకటనలు చూసి నమ్మి చాలామంది మోసపోతున్నారు. బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని చెప్పి ఖాతా వివరాలు తెలుసుకుని డబ్బులు గుంజిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా 'ఎనీ డెస్క్' యాప్ డౌన్లోడ్ చేయించి డబ్బులు కాజేసిన ఘటన లంగర్ హౌజ్‌లో చోటుచేసుకుంది.
బ్యాంకు ఖాతా అప్డేట్ చేసుకోవాలని చెప్పి డబ్బులు డ్రా
మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:సచివాలయం కూల్చివేతతో ఏర్పడే వ్యర్థాలను ఏం చేస్తారంటే..