తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాపై తప్పడు ప్రచారం.. పది మందికి పోలీసుల నోటీసులు - కరోనాపై తప్పడు ప్రచారం

సోషల్​ మీడియా ద్వారా కరోనాపై తప్పడు ప్రచారం చేస్తూ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్న వ్యక్తులను సైబర్​క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 10 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Cyber crime police have detained 10 people for allegedly mis representing Corona via social media
కరోనాపై తప్పడు ప్రచారం.. పది మందికి పోలీసుల నోటీసులు

By

Published : Apr 1, 2020, 6:34 AM IST

కరోనాపై సమాచారాన్ని ఫార్వార్డ్ చేస్తున్నారా... అయితే జాగ్రత్త... ఫేక్ మెసేజ్ చేస్తున్న వారిపై పోలీసులు ఓ కన్ను వేసి ఉంచారు. లాక్​డౌన్​లో భాగంగా కరోనా వైరస్​పై తప్పుడు సమాచారం, కేంద్ర బలగాలు వచ్చాయంటూ వైరల్ చేస్తున్న వాట్సప్ అడ్మిన్స్, యూట్యూబ్ ఛానెల్స్​ని సైబర్​ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 10 మందిని విచారించిన అనంతరం పోలీసులు నోటీసులిచ్చారు.

త్వరలో మరికొంత మందిని విచారించనున్నట్టు తెలిపారు. కరోనాపై భయాందోళనను కలిగించే విధంగా అపోలో డాక్టర్, సీనియర్ రిపోర్టర్ సంభాషణ ఆడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ప్రధాన నిందితుడు వహేబ్​ను అదుపులోకి తీసుకున్నట్టు సైబర్​క్రైం పోలీసులు వెల్లడించారు. కరీంనగర్​కి చెందిన వహేబ్​కు ఆ ఆడియో ఎక్కడి నుంచి వచ్చిందని విచారించిన అనంతరం నోటీసులిచ్చారు. విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా అందుబాటులో ఉండాలని పోలీసులు అతనికి ఆదేశాలు ఇచ్చారు.

ఇదీ చూడండి:ఇవాళ ఒక్కరోజు 15 కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details