తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళను బోల్తా కొట్టించిన సైబర్​ నేరగాళ్లు.. రూ.9 లక్షలు లూటీ! - సైబర్​ పోలీసులు

రాష్ట్రంలో సైబర్​ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సిమ్​ కార్డు, బహుమతి, లోన్​ అంటూ బురిడీ  కొట్టించి.. ఖాతాల్లోంచి డబ్బులు కొట్టేస్తున్న ఘటనలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా షేక్​పేట్​ ప్రాంతానికి చెందిన ఓ మహిళను ఈ-సిమ్​ కార్డు లోన్​ అంటూ బోల్తా కొట్టించి రూ.9.48 లక్షలు కాజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

cyber cheaters draw rs.9 lakhs form private employee
మహిళను బోల్తా కొట్టించిన సైబర్​ నేరగాళ్లు.. రూ.9 లక్షలు లూటీ!

By

Published : Aug 1, 2020, 9:48 PM IST

హైదరాబాద్​ పరిధిలో నిత్యం సైబర్​ నేరాలు, సైబర్​ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా షేక్​ పేట్​ ప్రాంతానికి చెందిన సాయి అవంతి అనే మహిళ.. ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. ఇటీవలే ఆపిల్​ లేటెస్ట్​ మోడల్​ మొబైల్​ కొనుగోలు చేశారు. ఆ మొబైల్​కి ఈ-సిమ్​ సౌకర్యం ఉంది. దీంతో ఆమె ఆ సౌకర్యాన్ని వినియోగించేందుకు ఆంగీకారం తెలిపింది. ఇంతలో ఆమెకు ఈ-సిమ్​ యాక్ట్​వేట్​ చేస్తామని ఒక ఫోన్​ వచ్చింది. అందుకు ఆమె ఒప్పుకొంది. మీ ఈ-సిమ్​ అప్​డేట్​ చేస్తామని, మొబైల్​కి ఓ కోడ్​ వస్తుందని.. అది చెప్పాలని అడిగారు. కోడ్​కు సంబంధించిన వివరాలు చెప్పగానే.. ఆమె ఈ-సిమ్​ను డిస్​కనెక్ట్​ చేశారు.

తాత్కాలికంగా అందుబాటులో ఉండడం కోసం మరో నెంబరు కావాలని అడిగారు. సదరు బాధితురాలు ఆమె తల్లి నెంబర్​ ఇచ్చింది. ఆ తర్వాత వెంటనే ఆ నెంబర్​కు ఫోన్​ చేసి మేడమ్​ ఈ-సిమ్​ అప్​డేట్​తో పాటు.. అందులో బ్యాంకు ఖాతా వివరాలు కూడా అప్​డేట్​ చేయాలని అడిగారు. వారి మాటలను పూర్తిగా నమ్మిన ఆమె ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా వివరాలు చెప్పింది. మరుక్షణమే ఆమె ఖాతా నుంచి రూ.9.48 లక్షలు కొట్టేశారు. అయితే.. ఈ సమాచారం ఉద్యోగినికి అందలేదు. ఈ-సిమ్​ యాక్టివేట్​ చేయడానికి 24 గంటలు పడుతుందని చెప్పడం వల్ల ఆమెకు ఆ సమాచారం అందలేదు. ఆఫీసులో మెయిల్​ చెక్​ చేసుకున్న బాధితురాలు తన ఖాతా నుంచి నగదు డ్రా అయినట్టు గుర్తించింది. వెంటనే బ్యాంకు అధికారులకు తన ఖాతా బ్లాక్​ చేయమని చెప్పింది. అనంతరం హైదరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవీ చూడండి:ఆగస్టు, సెప్టెంబర్​ నెలల్లో మరింతగా కరోనా విజృంభణ: ఈటల

ABOUT THE AUTHOR

...view details