హైదరాబాద్ లక్డీకాపూల్‌కు చెందిన రజనీ నగేష్‌కు బ్యాంకులో ఖాతా ఉంది. రెండు నెలల క్రితమే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని తీసుకుంది. అయితే నెల రోజులుగా ఆమెకు మీ ఖాతా డబ్బులు ఏమైనా డ్రా చేశారా అంటూ అలర్ట్ మెసేజ్‌లు వస్తున్నాయి. ఒకవేళ మీరు డబ్బులు డ్రా చేయని పక్షంలో 15151 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలని కోరతారు.
మెసేజ్‌లు పంపి 3.85లక్షల రూపాయలు స్వాహా..!
మీ ఖాతాలోంచి డబ్బులేమైనా డ్రా చేశారా... అని పలుమార్లు ఎస్ఎంఎస్లు పంపించి 3.85 లక్షలు దోచేసిన సంఘటన హైదరాబాద్‌లో జరిగింది.
మెసేజ్‌లు పంపి 3.85 లక్షల దోపిడీ
అది చూసిన ఆమె పలుమార్లు మెసేజ్ చేసింది. ఎన్నిసార్లు చేసినా ఫెయిల్ అని వచ్చింది. అయితే ఒక్కసారిగా ఆమె ఖాతాలో 3.85 లక్షలు డ్రా అయిపోయాయి. ఎలా జరిగిందో తెలియక బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.