విదేశాల నుంచి స్మగ్లింగ్ చేస్తున్న బంగారంపై కేంద్ర దర్యాప్తు విభాగాలు నిఘా పెంచాయి. అక్రమార్కులు వేస్తున్న రకరకాల ఎత్తులు చిత్తవుతున్నాయి. కేవలం నాలుగు నెలల్లో 15 మంది అక్రమార్కులను అరెస్ట్ చేసి దాదాపు రూ.9 కోట్ల విలువైన 28 కిలోల బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమంగా తరలించే వారి పని పట్టేందుకు విమానాశ్రయంలో నిఘా పెంచినట్లు చెబుతున్న కస్టమ్స్ అదనపు కమిషనర్ డాక్టర్ మంజులా హోస్మనితో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఎన్ని ఎత్తులేసినా... ఇట్టే పట్టేస్తాం...! - ఎన్ని ఎత్తులేసినా... ఇట్టే పట్టేస్తాం...!
విదేశాల నుంచి అక్రమ బంగారం, నగదు సరఫరా చేస్తున్నవారిని కస్టమ్స్ అధికారులు ఇట్టే పట్టేస్తున్నారు. ఊహకందని రీతిలో తరలిస్తున్నా... అక్రమార్కుల ఎత్తులను పసిగడుతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఇలా స్మగ్లింగ్ దందా నడిపిస్తున్నారని... కస్టమ్స్ డ్యూటీ పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
విమానాశ్రయంలో నిఘా
ఇవీ చూడండి: పాలమూరు-రంగారెడ్డిపై ప్రజాభిప్రాయ సేకరణ
Last Updated : May 8, 2019, 8:10 AM IST
TAGGED:
customs