తెలంగాణ

telangana

ETV Bharat / state

సహకరించండి.. లేకపోతే 24 గంటల కర్ఫ్యూ: కేసీఆర్ - Covid-19 latest updates

curfew in telangana: cm kcr
breaking

By

Published : Mar 24, 2020, 7:53 PM IST

Updated : Mar 24, 2020, 10:02 PM IST

18:12 March 24

సహకరించండి.. లేకపోతే 24 గంటల కర్ఫ్యూ: కేసీఆర్

రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ.. అందరూ సహకరించండి: సీఎం కేసీఆర్

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి కర్ఫ్యూ విధిస్తున్నామని సీఎం కేసీఆర్​ తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ ఉంటుందని వెల్లడించారు. దుకాణాలు సాయంత్రం 6 గంటలకే బంద్‌ చేయాలని స్పష్టం చేశారు. ఒక్క మనిషి కూడా రోడ్డు మీదికి రావద్దన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే డయల్‌ 100కు ఫోన్‌ చేస్తే సహాయం చేస్తారని చెప్పారు. గ్రామాల్లో వ్యవసాయ పనులకు ప్రభుత్వం అనుమతి ఉందన్నారు. తమ గ్రామాలకు రావద్దని కొందరు కంచెలు కూడా వేస్తున్నారని సీఎం గుర్తు చేశారు. 

నాలుగు రోజులు జాగ్రత్తగా ఉంటే రాష్ట్రాన్ని కాపాడుకున్న వాళ్లం అవుతామన్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కొంత మంది వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోవాలని సూచించారు. ప్రజలు వినకపోతే పెట్రోల్‌ బంకులు కూడా మూయాల్సి వస్తుందని హెచ్చరించారు.  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయి తెలిపారు.

ఇదీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము

Last Updated : Mar 24, 2020, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details