తెలంగాణ

telangana

ETV Bharat / state

Mega vaccination drive: నెలలో కొవిడ్ వ్యాక్సినేషన్ ఫస్ట్​డోస్ వందశాతం పూర్తి చేస్తాం: సీఎస్

వ్యాక్సిన్ కోసం ఎక్కువసేపు నిరీక్షించకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఖాజాగుడాలోని వలస కూలీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సోమేశ్‌కుమార్‌ రాష్ట్రంలో ఇప్పటివరకు 2 కోట్ల 80 లక్షల డోసులు పంపిణీ చేశామని తెలిపారు. నెలలోగా వందశాతం తొలి డోసు పూర్తి చేస్తామని..

Mega vaccination drive
మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

By

Published : Oct 12, 2021, 11:30 AM IST

Updated : Oct 12, 2021, 11:50 AM IST

హైదరాబాద్​లోని ఖాజాగుడాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ (Mega vaccination drive) కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్​ (Mega vaccination drive)ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని (Mega vaccination drive) సీఎస్​ సోమేశ్ కుమార్ ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 వరకు వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగనున్నట్లు సీఎస్​ తెలిపారు.

వ్యాక్సినేషన్‌పై స్థానిక కాలనీల్లో ప్రచారం చేయాలి. వ్యాక్సిన్ కోసం ఎక్కువసేపు నిరీక్షించకుండా ఏర్పాట్లు చేయాలి. ఖాజాగుడాలోని వలస కూలీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2.8 కోట్ల డోసులు పంపిణీ చేశాము. నెలలోగా వందశాతం తొలి డోసు పూర్తి చేయగలం. ప్రతి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నాం.

మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్

-సీఎస్​ సోమేశ్ కుమార్

ప్రజలకు వ్యాక్సినేషన్​పై అవగాహన చేయాలని సీఎస్... అధికారులకు సూచించారు. ప్రతి జిల్లాల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్​ (Mega vaccination drive)లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వ్యాక్సిన్​ డోసులు తక్కువైన చోట కలెక్టర్లతో మాట్లాడుతున్నామని సీఎస్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:భారీగా తగ్గిన కరోనా కేసులు- కొత్తగా14,313 మందికివైరస్​

Last Updated : Oct 12, 2021, 11:50 AM IST

ABOUT THE AUTHOR

...view details