తెలంగాణ

telangana

ETV Bharat / state

CS: కరోనా మూడో దశ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధం: సీఎస్‌

కొవిడ్‌ని అడ్డుకునేందుకు టీకానే ఉత్తమమైన మార్గమని సీఎస్‌ సోమేశ్​ కుమార్ అన్నారు. సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్‌లో వృద్ధుల కోసం ప్రత్యేక టీకా డ్రైవ్‌ని ఆయన ప్రారంభించారు. కరోనా మూడో దశ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎస్‌ తెలిపారు.

CS somesh kumar
సీఎస్‌ సోమేశ్​ కుమార్

By

Published : Jun 6, 2021, 5:01 PM IST

కొవిడ్​ మహమ్మారిని అడ్డుకునేందుకు ఉన్న ఉత్తమమైన మార్గం... వ్యాక్సినేషన్ ఒక్కటే అని సీఎస్ సోమేష్ కుమార్ అన్నారు. సికింద్రాబాద్ బన్సీలాల్ పేట్‌లో వృద్ధుల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌ని ప్రారంభించిన ఆయన... అర్హులైన ప్రతి ఒక్కరు తప్పక వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న వృద్ధాశ్రమాల్లో నేరుగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన సంచార వాహనాలను సీఎస్ ప్రారంభించారు. కరోనా మూడో దశ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, కలెక్టర్ శ్వేతా మహంతి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

సీఎస్‌ సోమేశ్​ కుమార్

ఇదీ చూడండి:CM KCR: ఈ నెల 9న డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details