వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలల్లోనూ ఉద్యోగుల వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
'ఉద్యోగుల వయోపరిమితి పెంపు వర్తింపు చేసుకోవాలి' - telangana government employees
ఉద్యోగుల వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలల్లో వయోపరిమితి అమలు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
వయోపరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వర్తింపు చేసుకోవాలని ఆయా సంస్థలకు రాష్ట్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రధానంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వం పరిధిలో నడుస్తున్న ఇతర సంస్థలకు ఈ పెంపు వర్తిస్తుందని వివరించారు. తక్షణమే సంబంధిత సంస్థల అధిపతులు, ప్రభుత్వ కార్యదర్శులు ఈ ఉత్తర్వులు అమలు అయ్యేట్లు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి :సాంప్రదాయ పంటలకు స్వస్తి.. దీర్ఘకాలిక సాగుతో లాభార్జన