రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పనపై సీఎస్ సోమేశ్‌కుమార్ వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. బీఆర్కే భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీహెచ్ శ్రీనివాస రావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
CS SOMESH KUMAR: 'వారికి వెంటనే వ్యాక్సినేషన్ పూర్తి చేయండి'
మూడో వేవ్‌పై వార్తలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ టీకా తీసుకోని వారికి ప్రత్యేక డ్రైవ్ ద్వారా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాల కల్పనపై సీఎస్ వైద్యారోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని బోధన, జిల్లా ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు, అదనపు అంతస్థుల నిర్మాణం, పిల్లల ఆక్సిజన్, ఐసీయూ పడకల పెంపు ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మూడో వేవ్‌పై వార్తలు వస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ కొవిడ్ టీకా తీసుకోని వారందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఇదీ చూడండి: సచివాలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్..