తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది: సోమేశ్​ కుమార్​ - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో కరోనా పూర్తి స్థాయిలో అదుపులో ఉందని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ తెలిపారు. కేంద్ర కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన దృశ్యమాధ్యమ సమీక్షలో పాల్గొన్నారు.

cs somesh kumar participated video conference with central cabinate secretory rajiv gouba
రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది: సోమేశ్​ కుమార్​

By

Published : Feb 27, 2021, 4:09 PM IST

కేంద్ర కేబినేట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ పాల్గొన్నారు. తెలంగాణలో కరోనా పూర్తి స్థాయిలో అదుపులో ఉందని.. పాజిటివ్ రేటు కేవలం 0.43 శాతం ఉందని తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి రోజు 200లోపు కేసులు నమోదు అవుతున్నాయని, ఇది చాలా తక్కువని సమావేశంలో చెప్పారు. 1100 ప్రాంతాల్లో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించడం వల్ల కేసుల సంఖ్య, కరోనా నియంత్రణ సాధ్యమైందని... ఎవరికైన కరోనా పాజిటివ్ వస్తే వెంటనే మెడిసిన్ కిట్స్​ను అందిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉంది: సోమేశ్​ కుమార్​

ఇప్పటికే 75 శాతం మంది హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్​కు వ్యాక్సినేషన్ ఇచ్చామన్న సోమేశ్ కుమార్... వచ్చేనెల ఒకటో తేదీన ప్రారంభమయ్యే మూడో విడత వ్యాక్సినేషన్​కు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొవిడ్ కేసులు వేగంగా పెరగకుండా నియంత్రణ కోసం కంటైన్మెంట్, సర్వైలెన్స్, పెద్ద స్థాయిలో వ్యాక్సినేషన్, తదితర చర్యలు చేపట్టాలని రాజీవ్​ గౌబా సూచించారు.

ఇదీ చదవండి:పట్టపగలే న్యాయవాది దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details